Surprise Me!

Warangal Floods ఒక్క రాత్రిలో వరంగల్ మునిగింది.. రోడ్లు నదులైపోయాయి Montha Effect | Oneindia Telugu

2025-10-30 10 Dailymotion

Warangal city is completely submerged as Cyclone Montha lashes Telangana with heavy rains and strong winds. Streets have turned into rivers in areas like Hunter Road, Fort Road, Kazipet, and Hanamkonda. The NDRF teams are carrying out rescue operations as people remain stranded in flooded houses. The impact of Cyclone Montha continues to wreak havoc across Telangana. Watch the latest visuals, live updates, and government rescue efforts from Warangal’s flood-hit zones.

మొంథా తుపాను తెలుగు రాష్ట్రాల పై విరుచుకుపడింది. తీరం దాటిన తరువాత ఏపీలో పరిస్థితి మెరుగు అవుతుందనుకుంటున్న సమయంలో తెలంగాణ వణికిపోయింది. జోరువానతో వరంగల్, హన్మకొండ సహా పలు ప్రాంతాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందనే హెచ్చరికలతో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

మొంథా తుపాను దిశ మార్చుకుని తెలంగాణ పై విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరంగల్‌ నగరం జలదిగ్బంధం అయింది. వర్షపు నీరు పలు కాలనీలను ముంచెత్తింది. మొత్తం 45 కాలనీలను వరద నీరు ముంచెత్తింది. నగరం పరిధిలోని 30 కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇండ్లలో కి చేరింది. దీంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్‌ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హనుమకొండలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తున్నది. వర్షపు నీటితో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. హంటర్‌రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్‌, హనుమకొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

#WarangalFloods #CycloneMontha #WarangalNews #TelanganaRains #WarangalToday #NDRFRescue #WarangalRainNews #WarangalFloods2025 #TelanganaNews #MonthaCyclone

Buy Now on CodeCanyon